మంగళవారం, 1 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవి
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2025 (13:27 IST)

Pooja Hegde: రజనీకాంత్ కూలిలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కు భారి డిమాండ్ !

Pooja Hegde
Pooja Hegde
రజనీకాంత్  కొత్త ఛిత్రం కూలీ ని  దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ తెరకేస్తున్నారు.  ఈ చిత్రంలో నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్ మరియు ఇతర తారాగణం ఉన్నారు. కళానిధి మారన్ నిర్మిస్తున్న కూలీ ఈ సంవత్సరంలో భారీ చిత్రాలలో ఒకటి. కాగా,  మేకర్స్ ఒక ప్రత్యేక పాట కోసం పూజా హెగ్డేని తీసుకున్నారు.
 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ మంగళవారంతో పూర్తయింది. పూజా హెగ్డే సౌత్ సినిమాకి పునరాగమనం చేస్తూ ఇప్పటికే సూర్య, తమిళ సూపర్ స్టార్ విజయ్ సరసన సినిమాలకు సైన్ చేసింది. ఆమె తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న సమయంలో హిందీ ప్రాజెక్ట్‌లకు కూడా సంతకం చేసింది, ఇది రజనీకాంత్ చిత్రం కాబట్టి ఆమె కూలీలో ఈ ప్రత్యేక పాటను చేసిందని తెలుస్తోంది. 
 
మూడు రోజుల పాటు చిత్రీకరించిన ఈ ప్రత్యేక పాట కోసం పూజ రూ. 2 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఒక ప్రత్యేక పాట కోసం ఒక నటికి చెల్లించే అత్యధిక రుసుములలో ఒకటిగా నిలిచింది. తారాగణం,  అధిక నిర్మాణ విలువతో, కూలీ ఒక భారీ ఎంటర్టైనర్గా అంచనా వేయబడింది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వేసవికి విడుదల చేయనున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తమిళ చిత్రసీమలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకరు. అతను గతంలో లియో, విక్రమ్, మాస్టర్, కైతి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కూలీలో, రజనీకాంత్ దేవ అనే పాత్రలో నటించారు.