మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (19:52 IST)

లోకేష్ కనగరాజ్‌- రజనీకాంత్ మూవీలో అమీర్ ఖాన్!?

Aamir khan
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన తదుపరి చిత్రం హిట్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనగరాజ్‌తో నటించనున్నాడు. లోకేష్ కనకరాజ్ -సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో తెరకెక్కె సినిమా ద్వారా అమీర్ ఖాన్ దక్షిణాది సినిమాలో భాగమయ్యే అవకాశం ఉందని సమాచారం. 
 
ఈ ఎంట్రీ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి చెందిన దిగ్గజాలు అమీర్-రజనీకాంత్ కలిసి నటించడం ఫ్యాన్స్‌కు పండగలాంటిది. ఈ ఇద్దరు స్టార్లు కలిసి నటించడం ఇది రెండోసారి. వీరిద్దరూ గతంలో 1995లో వచ్చిన "ఆటంక్ హాయ్ ఆటంక్" చిత్రంలో పనిచేశారు. ఇది 1972 చిత్రం "ది గాడ్ ఫాదర్" నుండి ప్రేరణ పొందింది.
 
ఇక తాజాగా కనగరాజ్ లియో, విక్రమ్, ఖైదీ, మాస్టర్ వంటి చిత్రాలతో హిట్ కొట్టాడు. అమీర్ ఖాన్ తదుపరి చిత్రం "సితారే జమీన్ పర్"లో కనిపించనున్నాడు.