బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్

డాడీ కోసం వెనక్కి తగ్గిన డాటర్... బెట్టు వీడిన హీరో... దంపతులుగా జీవించేందుకు సై?

Dhanush-Aishwarya
తన తండ్రి ఆరోగ్యం దృష్ట్యా కుమార్తె వెనక్కి తగ్గారు. మామ అనారోగ్యంతో పాటు కుటుంబ కారణాల వల్ల కోలీవుడ్ హీరో బెట్టు వీడారు. ఈ ఇద్దరూ కలిసి జీవించేందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది. ఆ కోలీవుడ్ హీరో ఎవరో కాదు ధనుష్, డాటర్ పేరు ఐశ్వర్య రజనీకాంత్. ఈ ఇద్దరు దంపతులు మళ్లీ ఒక్కటయ్యేందుకు అంగీకరించినట్టు సమాచారం. 
 
గత 2022 నుంచి ఈ జంట వేర్వేరుగా ఉంటుంది. అదేక్రమంలో తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ధనుష్, ఐశ్వర్యలు చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటికే రెండు విచారణలు ముగిశాయి. ఈ విచారణకు హాజరుకావాల్సిన ధనుష్, ఐశ్వర్యలు కోర్టుకు వెళ్లలేదు. దీంతో మూడో విచారణ నవంబరు రెండో తేదీకి కోర్టు వాయిదా వేసింది. 
 
అయితే, విడాకుల అంశంపై జరిగే విచారణకు వీరిద్దరూ ఉద్దేశపూర్వకంగానే హాజరుకావడం లేదన్న ప్రచారం కోలీవుడ్‌లో సాగుతుంది. తమ ఇరు కుటుంబ కారణాలు, సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యం దృష్ట్యా ఐశ్వర్యతో పాటు ధనుష్ కూడా కాస్త వెనక్కి తగ్గినట్టు సమాచారం. పైగా, ధనుశ్‌తో కలిసి వుండేందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది. అయితే, వీరిద్దరి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. ఇందులో నిజమెంతో తెలియనప్పటికీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.