శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (17:50 IST)

రజనీకాంత్‌తో కలిసి నటించడమే టార్గెట్.. చందమామ కాజల్ అగర్వాల్

బాహుబలి రానా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' బుధవారం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అందాల రాశి, చందమామ కాజల్ అగర్వాల్ గ్లామర్ పంట పండించిందని యూనిట్ వర్గాల సమాచారం. ఖ

బాహుబలి రానా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' బుధవారం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అందాల రాశి, చందమామ కాజల్ అగర్వాల్ గ్లామర్ పంట పండించిందని యూనిట్ వర్గాల సమాచారం. ఖైదీ నెంబర్‌ 150లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కాజల్.. హిట్ సినిమాలతో దూసుకెళ్తోంది. రానాతో నటించిన చిత్రంలో అమ్మడు అందాలను ఏమాత్రం తగ్గకుండా చిత్రీకరించారు. 
 
ఖైదీకి తర్వాత కాజల్‌కు మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి. తెలుగు, తమిళంలో రెండేసి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కాజల్‌ ప్రస్తుతం పెద్ద టార్గెటే పెట్టుకుందట. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ సరసన నటించాలని ఉవ్విళ్లూరుతుందట. 
 
ఈ ఏడాదిలో ఖైదీలో తన తొలి హిట్‌ను ఖాతాలో వేసుకున్న కాజల్ అగర్వాల్.. కోలీవుడ్ టాప్ హీరోల సరసన నటించేసింది. అజిత్‌తో కాజల్ అగర్వాల్ నటించిన వివేగం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ఇప్పటికే విజయ్, అజిత్‌, కార్తీ, ధనుష్‌ ఇలా యంగ్ హీరోలతో నటించిన కాజల్.. రజనీకాంత్‌లో స్క్రీన్‌ను పంచుకోవాలని అనుకుంటుందట. రజనీ సరసన నటించే అవకాశం కోసం అమ్మడు ఎదురుచూస్తుందట.