మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By tj
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (14:27 IST)

అభిమానులు రాజకీయాల్లోకి రమ్మంటున్నారు... : మహేష్‌ బాబు

ప్రస్తుతం సినీరంగంలో ఉన్న ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్ళడం పరిపాటిగా మారిపోతోంది. కొంతమంది అయితే సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి తిరిగి అదే రంగానికే వచ్చేస్తున్నారు.

ప్రస్తుతం సినీరంగంలో ఉన్న ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్ళడం పరిపాటిగా మారిపోతోంది. కొంతమంది అయితే సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి తిరిగి అదే రంగానికే వచ్చేస్తున్నారు. ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడని సినీనటుడు మహేష్‌ బాబు తాజాగా ఒక ప్రకటన చేశారు. ఎంతో ఆశక్తిగా ఉన్న ఈ ప్రకటన ప్రస్తుతం ఆయన అభిమానులను ఆలోచింపజేస్తోంది.
 
తమిళంలోని ఒక మాసపత్రికకు ఇంటర్య్వూ ఇచ్చిన మహేష్‌ బాబు ఈ ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. చాలామంది రాజకీయాలకు వెళ్ళు అంటున్నారు. అయితే నాకు మాత్రం ఇష్టం లేదు. నాకు సినిమాలంటేనే ఇష్టం. ఎప్పుడు సినిమా.. సినిమా.. సినిమా.. ఇదే నా లోకం అన్నారట. అంతేకాదు చెన్నైలో 24 సంవత్సరాల పాటు ఉన్నానని, సూర్య, కార్తీలు తనకు మంచి స్నేహితులని చెప్పారు. 
 
సూర్య తన క్లాస్మెట్ అని సంతోషంగా చెప్పారట మహేష్‌. రాజకీయాల్లోకి రావడం మాత్రం ఏ రకంగాను ఇష్టం లేదని, అభిమానులు ఎక్కడ ఒత్తిడి తెచ్చినా వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పారట మహేష్‌.