Daily Horoscope
✕

నితిన్ భీష్మ గురించి ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్..!

Written By శ్రీ
Updated: సోమవారం, 14 అక్టోబరు 2019 (14:40 IST)
నితిన్- రష్మిక మందన్నా జంట‌గా న‌టిస్తున్న చిత్రం భీష్మ‌. ఈ చిత్రానికి ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  తన చిత్రాలతో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న నితిన్ నుంచి ఒక మంచి సినిమా కోసం అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. 
 
భీష్మ సినిమా స్టార్ట్ అయి చాలా రోజులు అయ్యింది కానీ... సరైన అప్డేట్ కూడా రాకపోవడంతో అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. అయితే.. భీష్మ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ తెలిసింది. అది ఏంటంటే... ఈ సినిమాకు సంబంధించిన ఆఫీసియల్ అప్డేట్ దీపావళికి ఖచ్చితంగా ఉండబోతున్నట్టుగా తెలిసింది. 
 
అంతే కాకుండా... ఈ చిత్రంలో మరొక సర్ప్రైజ్ కూడా ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. యువ హీరో నాగశౌర్య కూడా ఇందులో న‌టిస్తున్నాడ‌ట‌. అయితే.. నాగశౌర్య క్యామియోలో నటిస్తున్నారా..? లేక కొంచెం లెంగ్తీ రోల్‌లో కనిపించనున్నారా..? అన్నది తెలియాల్సి ఉంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పైన భీష్మ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి.

అన్నీ చూడండి

తిరుమల చరిత్రలోనే తొలిసారి... విరాళంగా రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారం

రెండు దశాబ్దాలు పనిచేస్తే చెప్పాపెట్టకుండా తీసేసారు... మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆవేదన

ముసుగు ధరించని ముస్లిం వధువులు వేశ్యలతో సమానం : బీహార్ ఎంఐఎం అధ్యక్షుడు

ఆమె కేవలం నా సోదరి మాత్రమే కాదు, నా పెద్ద కుమార్తె లాంటిది.. జగన్

గాజు గ్లాసు గుర్తుపై గెలిచి ఏం చేస్తున్నావ్? ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను తరిమికొట్టిన ప్రజలు

అన్నీ చూడండి

విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?

క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్‌కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

తర్వాతి కథనం
Show comments