మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2024 (19:13 IST)

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

Chiranjeevi
Chiranjeevi
అల్లు అర్జున్ బిహేవియర్ తో చే చేతులారా చేసుకున్నాడా?  తన దూకుడే ఇంతవరకు తెచ్చిందా? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్న మాటలకు వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో మరింత బద్ నామ్ అయ్యాడా?  నిన్నటివరకు జరిగిన అల్లు అర్జున్ ఇంటిపై దాడి. ఇవన్నీ సినీ పెద్దలు సీరియస్ గా భావిస్తున్నారు. అందుకే నేడు చిరంజీవి ఢిల్లీ వెళుతున్నారని వార్త ప్రబలంగా వినిపిస్తుంది. మరి కాంగ్రెస్ తో కూడా మంచి సంబంధాలున్న చిరంజీవి... పుష్ప 2లో ఫొటో కోసం సి.ఎం.ను మార్చేసిన అల్లు అర్జున్ తెలంగాణాలో కూడా మార్చేస్తాడేమోనని టాక్ కూడా ప్రధానంగా ఫిలింగనర్ లో హల్ చల్ చేస్తుంది.
 
ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో చోటుచేసుకున్న సంఘటనలు చాలా సీరియస్ గా వున్నాయని సినీ పెద్దలు భావిస్తున్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా చాలా తప్పిదమే అని విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ తన తప్పేమీలేదని చెప్పడం మరో తప్పిదంగా కొందరు ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవతి కుటుంబాన్ని రహస్యంగా కలిసి వచ్చిహామీ ఇస్తే బాగుండేది కదా. ఇంతవరకు ఇష్యూ వచ్చేది కాదని మరికొందరు తెలియజేస్తున్నారు. చాలా తప్పిదాలు తగ్గెదేలే అన్న అల్లు అర్జున్ పై వేలెత్తి చూపుతున్నాయి.
 
గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి కేంద్రంతో పలువురితో సత్ సంబంధాలున్నాయి. కిషన్ రెడ్డి కూడా గతంలో చిరంజీవిని కలిసి చిట్ చాట్ కూడా చేశాడు. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంతో మాట్లాడి తన మేనల్లుడు అల్లు అర్జున్ ఇష్యూ గురించేనా? అనే టాక్ కూడా వుంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే ఉద్దేశ్యంలో వున్నట్లు కూడా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ఆర్టికల్ 360 కింద పెట్టేయవచ్చు అని టాక్ కూడా కొనసాగుతుంది. 
 
అసలు సినిమాల టికెట్ల రేట్ల విషయంలోనూ, సబ్సిడీలోనూ నేనుంత వరకే జరగదు అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడం కూడా సినీ ప్రముఖులు సీరియస్ తీసుకున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్ కు సినిమా ఇండస్ట్రీ కూడా తరలి వెళుతుందా? అనే అనుమానాలుకూడా వున్నాయి. కానీ ప్రముఖ నిర్మాత నాగవంశీ దీనిపై మాట్లాడుతూ, ఆంద్రలో పవన్ గారు రమ్మని అడిగారు. కానీ తెలంగాణాలో అందరూ స్థిరపడ్డారు. కనుక దీనిపై ఇంకేం చెప్పలేనని ఈరోజుప్రకటించారు.
 
జె.ఎ.సి. వాళ్ళు కూడా అల్లు అర్జున్ ఇంటిపై పూలకుండీలు పగలకొట్టడం, గోడలు దూకడంవంటి సన్నివేశాలతో ఆంద్ర నిర్మాతలు, హీరోలు కూడా ఆలోచిస్తున్నారు. దీనిపై ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి సీరియస్ తీసుకున్నారనే టాక్. అదేవిధంగా ఇండస్ట్రీ పెద్దలు కూడా చిరంజీవికి ఏకరువుపెట్టినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ మాట్లాడితే చిరంజీవి ఢిల్లీ వెళ్లి ఒకసారి వస్తానని అని వుండవచ్చని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. 
 
అదీకాకుండా అసలు ముందుగానే అల్లు అర్జున్ పెద్దలను తీసుకుని సి.పి. ఆనంద్ ను కలిసి క్షమాపణలు చెబుతున్నాను. ప్రెస్ మీట్ లో నేను మాట్లాడిన మాటలు, అబద్ధాలు ప్రచారం అవుతున్నాయని మాటను విత్ డ్రా చేసుకుంటున్నాను, నా వైపు తప్పును క్షమాపణ చెప్పుకుంటున్నానని రిక్వెస్ట్ చేస్తే బాగుంటుందని సినీ పెద్దలు చెబుతున్నారు. ఇక కోర్టులో కేసు వున్నందున చట్ట ప్రకారం చర్యలకు అభ్యంతరం చెప్పను అని వెళితే బాగుంటుంది అని సినీరంగంలో ఓ వర్గం కూడా చెబుతోంది.