శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (00:42 IST)

దేవరలో స్టెప్పులేయనున్న పూజా హెగ్డే?

pooja hegde
యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ అంచనాల చిత్రం దేవర విడుదలకు సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్​బస్టర్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 
 
"దేవర" ఈపాటికే రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని పోస్ట్​పోన్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ దేవరలో ఒక ఐటమ్ సాంగ్ ఉందట. ఆ పాటలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన డాన్స్​తో అలరించనున్నారని తెలుస్తోంది.
 
ఎన్టీఆర్​తో కలసి డ్యాన్స్ చేసేందుకు పూజ ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. గతంలో యంగ్ టైగర్​తో కలసి ‘అరవింద సమేత’లో హీరోయిన్​గా యాక్ట్ చేశారు పూజ. ఇప్పుడు మరోమారు ఆయనతో కలసి తెర మీద సందడి చేసేందుకు రెడీ అవుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.