బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2024 (12:32 IST)

బాంద్రాలో రూ.45కోట్ల కొత్త ఇల్లు కొనుగోలు చేసిన పూజా హేగ్డే

Pooja Hegde _Lehanga
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్‌తో కలిసి త్వరలో రాబోయే చిత్రం దేవాలో కనిపించనున్న నటి పూజా హెగ్డే తన కొత్త ఇంట్లోకి మారనుంది. సముద్రానికి సమీపంలో బాంద్రాలో పూజా హెగ్డే ఇల్లు కొనుగోలు చేసింది. 4,000 చదరపు అడుగుల ఈ ఆస్తి విలువ రూ. 45 కోట్లు.
 
ఈ ఫ్లాట్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉంది. ఈ ఆస్తిని కొనుగోలు చేసేందుకు ముందు పూజ గోవాకు వెకేషన్‌కు వెళ్లింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 26.6 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న పూజా హెగ్డే.. ఇటీవల మేకప్ లేని గోవా ఎండలో విహరిస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే దేవా, సంకితో పాటు మూడు ప్రధాన దక్షిణ భారత ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.