గురువారం, 27 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవి
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2025 (10:12 IST)

dubai: టాలీవుడ్ ప్రముఖులు తరచూ దుబాయ్ వెళ్ళేది అందుకేనా ?

Producer Selagam Shetty Kedar
Producer Selagam Shetty Kedar
నిర్మాత సెలగం శెట్టి  కేదార్ మరణంతో టాలీవుడ్ లో స్టార్స్, నిర్మాతలకు అగమ్యగోచరం గా మారింది.  టాలీవుడ్ లో అగ్ర హీరోలకు, నిర్మాతలకు బినామిగా ఉన్న కేదార్ మరణం కుదిపెసింది. ఇతెవలె హైదరాబాద్ రాడిసన్ హోటల్ లో బయటపడిన డ్రగ్ కేసులో ఆయన సూత్రధారుడు. ఈ విషయాన్ని పోలీస్ లు ప్రకటించారు.  ఆ తర్వాత కేదార్ హైదరాబాద్ నుంచి దుబాయ్ కు మార్చాడు. అక్కడ ఖరేదైనా జుమేరా లీక్ టవర్స్ లో నివాసం ఉన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నిన్న ఆయన మరణం తో ఒక్కసారిగా టాలీవుడ్ కలవపడింది.
 
ఈమధ్య అగ్ర హీరోల సినిమా ఫంక్షన్ లు దుబాయ్ లో జరపడం మొదలు పెట్టారు. అంతే కాకుండా తరచూ అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు దుబాయి వెళ్లి రావడం జరుగుతుంది. బహుశా ఇందుకేమో వెళుతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. ఇటివలే అగ్ర హీరోలు దుబాయి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఓ ప్రముఖ నిర్మత పెద్ద హీరోలతో సినిమాలు తీస్తూ, తన వేడుకలు అక్కడ చేసుకున్నారు. సినిమా షూటింగ్ పేరుతోనో, ప్రీ రిలీజ్ పేరుతోనో, వేడుకలు పేరుతోనో చాలామంది అక్కడికి వెళ్ళడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికే మాజీ శాసన సభుడు రోహిత్ రెడ్డి, కేదార్ మరణం చెందినప్పుడు అక్కడే ఉన్నాడని వార్తలు వచాయి. కాని. తాను లేనని వివరణ ఇచ్చారు.