Dharma Sangrah
✕

కాజల్ అగర్వాల్ లవ్‌లో పడిందా? ఎవరితో?

Written By జె
Updated: మంగళవారం, 4 డిశెంబరు 2018 (17:41 IST)
కాజల్ అగర్వాల్ ఓ యువనటుడితో లవ్‌లో పడిందంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. సినీ పరిశ్రమలో గుసగుసలు మామూలే. ఐతే ఆ యువ నటుడు ఎవరో కాజల్ అగర్వాల్ ఎక్కడకెళితే అక్కడకెళుతున్నాడట. టాప్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ ఓ యువ హీరోతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందట. 
 
కాజల్‌కు సినీపరిశ్రమలో ఎంతోమంది యువ నటులు తెలుసు. ఎంతోమంది సీనియర్ నటులతో కూడా నటించింది. ఆమె నటించిన కొన్ని సినిమాలకు సంబంధించిన హీరోలకు పెళ్ళిళ్ళు కూడా కాలేదు. వారందరినీ వదిలిపెట్టి అతడితో కాజల్ ప్రేమాయణం నడపుతోందట. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదంటున్నారు సినీప్రముఖులు. 
 
ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చని, వారిద్దరి అభిప్రాయాలు కలవడం వల్లనే ప్రేమ చిగురించి ఉంటుందంటున్నారు. ఇదిలావుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కాజల్ అగర్వాల్ కవచం సినిమాలో కలిసి నటించింది. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన విడుదల కానుంది.

అన్నీ చూడండి

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే పాస్ మార్కులు సాధించాల్సిందే...

ఏపీలో ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు

ఆవును కొరికిన కుక్క... శునకం మొరిగింది.. పాలను తాగిన 450మందికి రేబిస్ భయం

కుటుంబ వివాదం - మరిది కొరికాడని వదిన ఫిర్యాదు

వండలూరు జూకు వచ్చిన బర్డ్ ఫ్లూ.. వేడంతాంగల్‌లో ఏడు నీటి పక్షులు మృతి

అన్నీ చూడండి

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ సీజన్‌లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి

అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్‎టెక్

అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

అత్తి పండ్లను ఎందుకు తినాలో తెలుసా?

అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments