శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (19:57 IST)

కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందా..? 2 వారాలుగా కనిపించలేదే..

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గత ఏడాది తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లును పెళ్లాడింది కాజల్. ఆ తర్వాత హనీమూన్‌కు వెళ్ళింది. ఆ వెంటనే సినిమా షూటింగ్‌లతో బిజీ అయ్యింది. 
 
ఓ పక్క సినిమా షూటింగ్‌లతో బిజీ గా ఉంటూనే మరోపక్క ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ వస్తుంది. ఈ తరుణంలో కాజల్ గర్భం దాల్చిందనే వార్త బాలీవుడ్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కాజల్ సైలెంట్‌గా వుండటం ఈ పుకార్లకు మరింత ఊతమిస్తోంది. 
 
గడిచిన 2 వారాలుగా ఆమె సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక అప్ డేట్, ఓ కొత్త ఫొటోతో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే ఈ బ్యూటీ.. 2 వారాలుగా సైలెంట్ అవ్వడంతో, ఆమె గర్భవతి అనే పుకార్లు మరింత ఊపందుకున్నాయి. మరి ఈ వార్తలపై కాజల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.