మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (09:51 IST)

మోహ‌న్ లాల్ ''ఒప్పమ్'' రీమేక్‌లో కమల్ హాసన్: అంధుడి పాత్రలో కమల్

మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ న‌టించిన సినిమా ''ఒప్ప‌మ్''. మ‌ల‌యాళంలో సూప‌ర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ అంధుడి పాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రం ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన క్రై

మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ న‌టించిన సినిమా ''ఒప్ప‌మ్''. మ‌ల‌యాళంలో సూప‌ర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ అంధుడి పాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రం ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్. ఈ నెల 8న విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా ముందుకు దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని చూసిన లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ త‌మిళంలో ఈ మూవీని రీమేక్ చేయాల‌ని భావిస్తున్నాడు. 
 
అయితే ఇటీవ‌లే మెట్లపై నుంచి జారిప‌డిన క‌మ‌ల్… ప్ర‌స్తుతం కోలుకుంటున్నాడు. కాగా ఆయ‌న తాజా ప్రాజెక్టు ''శ‌భాష్ నాయుడు'' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గతంలో మోహన్‌లాల్ మలయాళంలో నటించిన ''దృశ్యం'' చిత్రం రీమేక్‌లో కూడా కమల్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయాన్ని సాధించింది. ఆయన నటిస్తున్న 'శభాష్ నాయుడు' సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే ఈ రీమేక్ సినిమాను ప్రారంభించనున్నారు. 
 
అప్పట్లో అటు తమిళంలో.. ఇటు తెలుగులో ఘన విజయాన్ని అందుకున్న సినిమా ఇది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఇటువంటి అంధుడి పాత్ర పోషించని కమల్ తాజాగా.. మరోసారి అంధుడి పాత్రలో నటించడానికి రెడీ అవడంతో అభిమానుల మధ్య ఆసక్తి నెలకొంది.