శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By venu
Last Modified: బుధవారం, 14 జూన్ 2017 (13:47 IST)

రోబో 2కి అప్పుడే సర్వమంగళం... బాహుబలి బలం ముందు రోబో ముక్కలేనా?

మరో దశాబ్దం పాటు ఏ సూపర్‌స్టార్ సినిమాకైనా, ఎంత భారీ బడ్జెట్ సినిమాకైనా జక్కన్న బాహుబలి మూలంగా సమస్యలు తప్పేలా లేవు. వచ్చే ప్రతి సినిమాకీ బాహుబలి రికార్డులతో పోలికపెట్టి రిలీజుకి ముందే సర్వమంగళం పాడేస్తున్నారు. ఈ పోలికలతో సదరు సూపర్‌స్టార్లు కళ్లు తే

మరో దశాబ్దం పాటు ఏ సూపర్‌స్టార్ సినిమాకైనా, ఎంత భారీ బడ్జెట్ సినిమాకైనా జక్కన్న బాహుబలి మూలంగా సమస్యలు తప్పేలా లేవు. వచ్చే ప్రతి సినిమాకీ బాహుబలి రికార్డులతో పోలికపెట్టి రిలీజుకి ముందే సర్వమంగళం పాడేస్తున్నారు. ఈ పోలికలతో సదరు సూపర్‌స్టార్లు కళ్లు తేలేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రజనీకాంత్ కూడా దీనికి అతీతుడు కాలేకపోయాడు మరి.
 
రోబో 2.0 సినిమా హిందీ రైట్స్ కనీసం రూ.100 కోట్లకు అమ్ముకోవాలనుకున్న నిర్మాతకు నిర్మొహమాటంగా నో చెప్పేసారట డిస్ట్రిబ్యూటర్లు. ఇంత మొత్తాన్ని రిస్క్ చేయలేమని, రూ.80 కోట్లకు అయితే ఫర్లేదన్నట్లుగా వినికిడి. శంకర్, రజనీలతో పాటు విలన్‌గా అక్షయ్‌కుమార్ కూడా చేరినప్పటికీ ప్రాజెక్ట్‌కి ఫ్యాన్సీ డీల్ కుదరకపోవడంతో చిత్ర బృందం నిరాశలో ఉన్నారట. 
 
రజనీకాంత్‌తో పాటు, అమీ జాక్సన్ సైతం రోబోలా దర్శనమివ్వనున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం.