ఖుష్బూ శ్రుతిని అంత మాట అనేసిందా? వృత్తిపై అంకితభావం లేని వారికి?

ఖుష్బు భర్త, నటుడు, దర్శకుడు సుందర్‌.సి దర్శకత్వంలో 'సంఘమిత్ర' చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాను రూ. 400కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రుతిహాసన్ ప్రధాన పాత్రధారిగా తేనాండాల్‌ ఫిల్మ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్లా

గురువారం, 20 జులై 2017 (14:03 IST)
ఖుష్బు భర్త, నటుడు, దర్శకుడు సుందర్‌.సి దర్శకత్వంలో 'సంఘమిత్ర' చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాను రూ. 400కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రుతిహాసన్ ప్రధాన పాత్రధారిగా తేనాండాల్‌ ఫిల్మ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేసింది. సినిమా కోసం కొన్ని రోజులు శ్రుతి హాసన్‌ కూడా కత్తియుద్ధాలు నేర్చుకున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా స్క్రిప్ట్‌ పూర్తి కాలేదని ఈ చిత్రం నుంచి శ్రుతిహాసన్ తప్పుకుంది.  దీంతో గత కొద్దిరోజులుగా ఈ చిత్రంపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా ఖుష్బు ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.
 
'సంఘమిత్ర' చిత్రంపై పలువురు అసత్య వదంతులను సృష్టిస్తున్నారు. సరైన పథకం లేకుండా సంఘమిత్రను తెరకెక్కించడం సాధ్యం కాదు. ఈ చిత్ర స్క్రిప్ట్‌ ఇంకా సిద్ధం కాలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఖుష్బూ తెలిపారు. రెండేళ్ల క్రితమే ఈ సినిమా ప్రారంభం అయ్యింది. అంకితభావం లేని వారికి వాటి గురించి ఏ మాత్రం తెలియదు. ఈ సినిమాకు చిత్రీకరణ 30 శాతం మాత్రమే ఉంటుంది.
 
అంతకు ముందుగానే మిగిలిన 70 శాతం పనులు పూర్తయ్యాయి. మీలో తప్పులు పెట్టుకుని ఇతరులపై నింద మోపడం సరైనది కాదు. సంప్రదాయ కుటుంబ నుంచి వచ్చిన మీ నుంచి వృత్తి గౌరవాన్ని కోరుకుంటున్నా. మీ తప్పులను మీరు అర్థం చేసుకుంటే.. అది మీ సుదూర ప్రయాణానికి సహకరిస్తుందని ఖుష్బూ తెలిపారు. ఈ వ్యాఖ్యలు శ్రుతిహాసన్‌ను ఉద్దేేశించే ఖుష్బూ చేశారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

అన్నీ చూడండి

తెలుగు రాష్ట్రాల్లో జూలై 4, 2026 నాటి వాతావరణం ఎలా వుంది...?

ప్రేయసికి నిశ్చితార్థం.. వివాహిత ప్రియుడి బెదిరింపులు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

అమరావతిపై కోర్టును ఆశ్రయించనున్న విజయ్ సాయి రెడ్డి.. సిగ్గు సిగ్గు.. అంటూ ఫైర్

హమ్మయ్య.. రుషికొండను అలా ఉపయోగించనున్న ఏపీ సర్కారు?

గిరిజన గ్రామంలో తాగు నీటి కొరత.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన

అన్నీ చూడండి

ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?

క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?

వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?

రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు

పద్మభూషణ్ డా. నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments