ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 19 అక్టోబరు 2020 (14:46 IST)

మళ్లీ వార్తల్లో మహేష్ బాబు - పూరి సినిమా

సూపర్ స్టార్ మహేష్‌ బాబు - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్... వీరిద్దరి కాంబినేషన్లో పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాలు రూపొందడం.. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడం తెలిసిందే. అప్పటి నుంచి మహేష్‌ - పూరి కలిసి మూడవ సినిమా చేస్తే... చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
 
అయితే... పూరి మహేష్ బాబుకి కథ చెప్పినప్పటికీ.. మహేష్‌ ఎటూ తేల్చడం లేదని గతంలో పూరి మీడియాకి చెప్పడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఇలా పూరి మహేష్ గురించి చెప్పడంతో ఇక మహేష్ బాబుతో పూరి సినిమా లేనట్టే అనుకున్నారు.
 
దీంతో పూరి మహేష్‌ బాబుతో తీయాలనుకున్న జనగణమన చిత్రాన్ని వెంకీతో తీయాలి అనుకున్నారు. కథ చెప్పడం.. వెంకీకి నచ్చడం జరిగింది కానీ ఈ మూవీకి బడ్జెట్ ఎక్కువవుతుంది. వెంకీతో భారీ బడ్జెట్‌తో మూవీ చేస్తే వర్కవుట్ కాదేమో అనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత పూరి కన్నడ రాక్ స్టార్ యాష్‌‌తో జనగణమన సినిమా తీయనున్నట్టు వార్తలు వచ్చాయి.
 
కేజీఎఫ్ 2 తర్వాత యాష్ పూరితో జనగణమన తీయనున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ... మహేష్ పూరి కలిసి సినిమా చేయాలనుకుంటున్నారని.. త్వరలో మహేష్ బాబుకి పూరి కథ చెప్పేందుకు రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందో లేదో చూడాలి.