శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వి
Last Modified: శనివారం, 3 అక్టోబరు 2020 (18:42 IST)

మహేష్ బాబు సినిమా కోసం కీర్తి సురేశ్ అలా అయిపోయిందా?

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది హీరోయిన్ కీర్తి సురేశ్. ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో మాత్రం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ వీడియోలో కీర్తి సురేశ్ జీరో సైజులో స్లిమ్‌గా కనిపించడమే దానికి కారణం.
 
ఎప్పుడూ బొద్దుగా కనిపించే కీర్తి సురేశ్ అలా సన్నగా అయిపోయేసరికి అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక కప్పు కాఫీ తనకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని, పరిస్థితులు ఎలా ఉన్నా తాను ఒక కప్పు కాఫీ తాగుతానని ఆమె తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ఈ అమ్మడు ఆరోగ్యంపై బాగా ఫోకస్ చేసి ఇలా మారిందని అభిమానుల అభిప్రాయం.
 
నేను శైలజ సనిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో  హీరోయిన్‌గా నటించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రను పోషించింది. ఆ చిత్రానికి గాను జాతీయ అవార్డును పొందింది.
 
ఇటీవల పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఆజ్ఞాతవాసి సినిమాలో మెరిసింది. దీని తర్వాత మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో పెట్టింది. అటు నితిన్, మహేష్ బాబులతో సహా పలు చిత్రాలలో నటిస్తోంది. ఐతే ప్రస్తుతం జీరో సైజ్ లుక్ మహేష్ బాబు చిత్రం కోసం అంటూ చెప్పుకుంటున్నారు.