సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (13:12 IST)

చెన్నైకి ఏమైంది.. ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఐపీఎల్ సీజన్‌లలో ఇప్పటివరకు మునుపెన్నడూ లేని విధంగా సీఎస్కే జట్టు పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. దీంతో సీఎస్కే షాకైంది. ఐపీఎల్ సీజన్‌లో ధోనీ సారథ్యంలోని సీఎస్కే జట్టు ఎప్పుడూ అగ్రస్థానంలోనే నిలుస్తుంది. గత 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో.. మునుపెన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో ఐపీఎల్ దిగజారింది. 
 
నిన్నటి వరకు 7వ స్థానంలో వుండిన చెన్నై ప్రస్తుతం 8వ స్థానానికి పడిపోయింది. మూడు మ్యాచ్‌లు ఆడిన ధోనీసేన ఒక విజయంతో రెండు పాయింట్లు మాత్రమే సాధించి చివరి స్థానానికి చేరుకుంది. 8వ స్థానంలో వుండిన హైదరాబాద్ జట్టు ప్రస్తుతం ఆరో స్థానానికి ఎగబాకింది. అలాగే ఢిల్లీ జట్టు అగ్రస్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం రెండో స్థానంలో ఢిల్లీ, అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిలిచింది.