సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 28 సెప్టెంబరు 2020 (23:10 IST)

ప్రభాస్ ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారట, ఎందుకో తెలుసా..?

బాహుబలి తెలుగు సినిమాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాతో ప్రభాస్ దేశ వ్యాప్తంగానే కాకుండా.. విదేశాల్లో సైతం మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నారు. దీంతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరగడంతో.. తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా మూవీస్‌నే ఎంచుకుంటున్నాడు. సాహో సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు.
 
ఇంకా చెప్పాలంటే.. సాహో సినిమా నార్త్‌లో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ను బయటపెట్టింది. దీంతో బాలీవుడ్ దర్శకనిర్మాతలు ప్రభాస్‌తో సినిమా చేసేందుకు క్యూకట్టారు. సాహో తర్వాత రాథేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని యు.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.
 
 వచ్చే సంవత్సరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ప్రభాస్ బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ అనే సినిమా చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమాని ఓంరౌత్ తెరకెక్కించనున్నారు. అసలు విషయానికి వస్తే... ఆదిపురుష్ మూవీ రామాయణం అని.. ఇందులో ప్రభాస్ రాముడు పాత్ర పోషించనున్నారని... బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ రావణుడు పాత్ర పోషించనున్నడు అంటూ వార్తలు వచ్చాయి. దీంతో ప్రభాస్ రాముడుగా కనిపించనున్నాడు అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ చాలా హ్యపీగా ఫీలయ్యారు.
 
ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా..? అని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఆదిపురుష్ రామాయణం కాదని.. ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించడని అంటున్నారు. కేవలం రాముడు లక్షణాలు మాత్రమే ఉంటాయట. ఇది తెలిసి ప్రభాస్ రాముడుగా కనిపించడా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. మరి... ఆదిపురుష్ టీమ్ త్వరలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.