ప్రభాస్ కోరిక తీరేదెప్పుడు?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాథేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా తర్వాత మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది.
ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండా బాలీవుడ్ మూవీ ఆదిపురష్ ఎనౌన్స్ చేసారు. ఇలా... బాహుబలి తర్వాత ప్రభాస్ తన ఇమేజ్‌కి తగ్గట్టుగా వరుసగా భారీ యాక్షన్ చిత్రాలనే చేస్తున్నారు. అయితే.. ప్రభాస్ కోరిక మాత్రం వేరే ఉందట. అది ఏంటంటే.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలనుకుంటున్నాడట. ఆయనకు కథలు చెప్పే డైరెక్టర్స్ మాత్రం భారీ యాక్షన్ స్టోరీసే చెబుతున్నారు.
ఇటీవల ప్రభాస్ తన మనసులో మాటను సన్నిహితుల దగ్గర బయటపెట్టాడట. ప్రభాస్ ఆలోచన తెలిసి ఎవరైనా ఫ్యామిలీ స్టోరీ రెడీ చేసిన ఈ కథతో ప్రభాస్ సినిమా చేయడానికి చాలా టైమ్ పడుతుంది. ఎందుకంటే... ప్రభాస్ రాథేశ్యామ్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో చేస్తున్న సినిమా, ఆదిపురుష్.. ఈ మూడు సినిమాలు రిలీజ్ అవ్వాలి. ఆతర్వాతే చేయాలి అంటే... చాలా టైమ్ పడుతుంది. మరి.. ప్రభాస్ కోరిక ఎప్పుడు తీరుతుందో..? ఎవరు తీరుస్తారో..?