శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (18:43 IST)

ప్రభాస్ బ్యానర్లో మారుతి, ఇంతకీ హీరో ఎవరు?

ప్రతిరోజు పండగే సినిమాతో సక్సెస్ సాధించినప్పటికీ, మారుతి తదుపరి చిత్రం ఎవరితో అనేది ఇంకా ఎనౌన్స్ చేయలేదు. కొంతమంది హీరోల పేర్లు తెర పైకి వచ్చినప్పటికీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. అయితే తాజా వార్త ఏంటంటే, మారుతి తదుపరి చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ బ్యానర్లోనే సినిమా చేయనున్నాడు. గతంలో ఈ బ్యానర్లో మారుతి మహానుభావుడు, ప్రతిరోజు పండగే చిత్రాలు తెరకెక్కించాడు.
 
ఇప్పుడు నెక్ట్స్ మూవీని కూడా యు.వి.క్రియేషన్స్ సంస్థకే చేయనున్నట్టు సమాచారం. అయితే.. హీరో ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మాస్ మహారాజా రవితేజ పేరు ప్రముఖుంగా వినిపిస్తోంది. రవితేజకు మారుతి కథ చెప్పినట్టు గతంలో వార్తలు వచ్చాయి కానీ.. అఫిషియల్‌గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రవితేజతో ప్రాజెక్ట్ సెట్ కాకపోతే... యంగ్ హీరో నటించే అవకాశం ఉంది అంటున్నారు.
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపిక చేస్తున్నారు. అంతా సెట్ అయిన తర్వాత త్వరలోనే ఈ మూవీని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారు. అప్పటివరకు మారుతి నెక్ట్స్ మూవీ హీరో ఎవరు అనేది సస్పెన్స్.