శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 31 ఆగస్టు 2020 (20:50 IST)

మారుతి ఆఫీస్‌లో సందడి చేసిన బన్నీ

కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో సినీ ప్రముఖులు ఇంటికే పరిమితం అయ్యారు. అయితే.. ఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గుముఖం పడుతుండటంతో సినీ ప్రముఖులు బయటకు వస్తున్నారు. సెప్టెంబర్ నుంచి షూటింగ్‌లు స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో సందడి స్టార్ట్ కానుంది. ఇదిలావుంటే.. కరోనా టైమ్ నుంచి బన్నీ ఇంటికే పరిమితం అయ్యారు.
 
 తాజాగా అల్లు అర్జున్ దర్శకుడు మారుతి ఆఫీసును సందర్శించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తున్నాయి. మారుతి ఆఫీసులోనూ ఎంతో ఉల్లాసంగా గడిపిన బన్నీ, ఆఫీసు పరిసరాలను ఆస్వాదించారు. ఈ ఫొటోలను నిర్మాత ఎస్కేఎన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు.
 
ఇదిలా ఉంటే.. బన్నీతో మారుతి ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ కన్ ఫర్మ్ అని వార్తలు వచ్చాయి కానీ... అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. మరి...ఈ కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో..?