సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (10:59 IST)

బాక్సర్‌గా వస్తున్నా.. స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నా.. ఈషా రెబ్బా

ఈషారెబ్బా ప్రస్తుతం బాక్సర్‌గా కనిపించనుంది. ఇందుకోసం మానసికంగా, శారీరకంగా ఆ పాత్రలో లీనమవడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకోసం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నానని తెలిపింది. ఇదే కాకుండా జిమ్నాస్టిక్స్‌లోనూ తర్పీదు పొందుతున్నానని చెప్పింది. నిజమైన బాక్సర్‌లా తెరపై చెలరేగడమే తన ముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చింది. 
 
లాక్‌డౌన్‌ గురించి మాట్లాడుతూ... ఇది తనకు క్రమశిక్షణ నేర్పించిందని తెలిపింది. తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న ఈషా రెబ్బా.. సరికొత్త పాత్రలను ఎంచుకుంటోంది. తాజాగా బాక్సర్‌గా అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నానని వెల్లడించింది. 
 
ఇకపోతే.. కరోనా కారణంగా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం సినిమాల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో సంపత్‌ నంది వెబ్ సిరీస్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడట. 
 
ఈషారెబ్బ లీడ్‌ రోల్‌లో నటించనున్న ఈ సినిమా రాత్రివేళ హైదరాబాద్‌ జీవనశైలిని ప్రతిబింబించే విధంగా సాగుతుందని తెలుస్తోంది. అయితే ఈషా రెబ్బ ప్రస్తుతం హిందీలో సూపర్‌హిట్‌ చిత్రం ''లస్ట్‌ స్టోరీస్''‌ రీమేక్‌ వెబ్‌సిరీస్‌తో బిజీగా ఉంది.