గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (17:41 IST)

సంపత్ నంది వెబ్ సిరీస్‌లో వ్యభిచారిగా ఈషా రెబ్బా..

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో థియేటర్లు తెరుచుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం సినిమాల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ సంపత్‌ నంది ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడని తెలిసింది. ఈషా రెబ్బ లీడ్‌ రోల్‌లో నటించనున్న ఈ సినిమా రాత్రివేళ హైదరాబాద్‌ జీవనశైలిని ప్రతిబింబించే విధంగా సాగుతుందని తెలుస్తోంది. 
 
ఈ వెబ్ సిరీస్‌లో ఈషా రెబ్బా వ్యభిచారిగా నటిస్తుందని తెలుస్తోంది. సంపత్ నంది స్నేహితుడు అశోక్ దర్శకత్వం వహించబోయే అర్బన్ సెటప్‌లో వేశ్య జీవితానికి సంబంధించిన కథను సంపత్ నంది చెక్కినట్లు చెప్తున్నారు.
 
అయితే ఈషా రెబ్బ ప్రస్తుతం హిందీలో సూపర్‌హిట్‌ చిత్రం 'లస్ట్‌ స్టోరీస్' రీమేక్‌ వెబ్‌సిరీస్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో మరి సంపత్‌ నంది చిత్రంలో ఈషారెబ్బ నటిస్తుందా..? లేదా..? అనేది తెలియాల్సి వుంది.