సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (20:31 IST)

1970ల నాటి కథతో వెబ్ సిరీస్.. కీలక పాత్రలో అమలాపాల్

1970ల నాటి కథతో తెలుగు- తమిళంలో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. అప్పటి పరిస్థితుల్ని తెలిపే నవల ఆధారంగా ఈ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రధారిగా ఆమె హీరోయిన్ అమలా పాల్‌ కనిపించనుంది. 
 
అయితే ఈ సిరీస్‌‌ ఆమెకు రెండో వెబ్ సిరీస్ కావడం విశేషం. హిందీలో మహేశ్‌ భట్‌, జియో స్టూడియోస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి అమలా పాల్‌ ఇటీవల ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. దీని ద్వారా అమలాపాల్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. అంటే అమలా పాల్‌ ఓటీటీలోనూ తన జోరు చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. 
 
ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా దర్శక నిర్మాతలు వెబ్‌సిరీస్‌లు, వెబ్‌ సినిమాల వెంటపడుతున్నారు. దీనికి హీరోయిన్లు కూడా అతీతం కాదు. సమంత ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్‌ 2' చేయగా... నిత్యమీనన్‌, సాయిపల్లవి, కాజల్‌ అగర్వాల్‌, తమన్నా ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం అమలా పాల్ కూడా అదే బాటలో పయనిస్తోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.