మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (19:40 IST)

అమలా పాల్‌కు ఎందుకు విడాకులు ఇచ్చామంటే... (Video)

ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తున్న వారిలో అమలా పాల్ ఒకరు. ఈమె సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. అంత తక్కువ సమయంలోనే ఆమె దర్శకుడు విజయ్‌తో ప్రేమలోపడిపోవడం, పెళ్లి చేసుకోవడం జరిగింది. 
 
అయితే, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడిపోయారు. అయితే, ఈ విడాకులకు గల కారణాలు మాత్రం ఇటు అమలాపాల్ లేదా అటు విజయ్‌లు ఇప్పటికి స్పందించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ తండ్రి అజగప్పన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 
'విజయ్ -  అమలా పాల్ ప్రేమించుకున్నారు. వారిద్దరూ ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అమలా పాల్ సినిమాలు చేయడం విజయ్‌కి ఇష్టం లేదు. పెళ్లికి ముందు అతని ఇష్ట ప్రకారమే నడుచుకుంటానని, సినిమాల్లో నటించనని అమలా పాల్ మాట ఇచ్చింది. 
 
కానీ ఆ తర్వాత వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టింది. మేము చెప్పినా, పుట్టింటివారు చెప్పినా ఆమె తన పద్ధతిని మార్చుకోలేదు. ఎవరు ఎంతగా చెబుతున్నా ఆమె పట్టించుకోకపోవడంతో, విడాకుల వరకూ వెళ్లవలసి వచ్చింది' అని అమలా పాల్ మాజీ మామ వివరించారు.