శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (14:00 IST)

వెబ్‌సిరీస్‌ వైపు అడుగులేస్తోన్న హన్సిక

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో సినీ ఇండస్ట్రీ కుదేలైంది. హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతలు వెబ్ సిరీస్‌ల దిశగా అడుగులేస్తున్నారు. తాజాగా హాట్ బ్యూటీ హన్సిక కూడా ఓ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అయ్యింది. ''భాగమతి'' ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందే ఓ వెబ్ సీరీస్‌లో హన్సిక నటించనున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందట. కథ నచ్చడంతో ఈ వెబ్ సిరీస్ చేసేందుకు హన్సిక వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. నేటి యువతకు కావాల్సిన హాట్ నెస్ జోడిస్తూ మహిళా సమస్యలను తనదైన స్టైల్‌లో చూపించనున్నారని తెలిసింది. అతిత్వరలో ఈ వెబ్ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనుంది.