గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (20:41 IST)

లస్ట్ స్టోరీస్ రీమేక్‌లో ఈషా రెబ్బా.. గ్లామర్ పంట పండిస్తుందా?

ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో హిట్టై లస్ట్ స్టోరీస్ వెబ్ సీరియల్ తెలుగు వెర్షన్‌లో ఈషా రెబ్బా నటిస్తోంది. దాంతో ఈషా రెబ్బ అబ్బా అనిపిస్తుందా అనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అసలే అందాల ఆరబోతకు ఏమాత్రం జంకని.. ఈ భామ లస్ట్ సిరీస్‌లో అందం, అభినయం పండిస్తుందని సినీ పండితులు అంటున్నారు.
 
దీనిపై ఈషా రెబ్బా మాట్లాడుతూ.. లస్ట్ స్టోరీస్‌ రీమేక్‌లో బోల్డ్ క్యారక్టర్ ఒప్పుకున్న ఈషా రెబ్బ తాను మితిమీరకుండానే అందాల ఆరబోత చేస్తానని అంటోంది. ఈ విషయంలో తనకు ఉన్న పరిధులూ, పరిమితులూ తెలుసు అని తెలివిగా చెబుతోంది. అంటే లస్ట్ స్టోరీస్‌లో గ్లామర్ వడ్డన ఎంత ఉండాలో అంతే అన్నట్లుగా తూకం వేస్తానని చెబుతోంది.
 
ఏది ఏమైనా గ్లామర్ ఓవర్ డోస్‌కు దూరంగా వుంటూనే చూపించాల్సింది చూపిస్తానని మాత్రం తీపి కబురు చెప్పింది. ఇంకేముంది... ఈషాకు సినీ ఛాన్సులు రాకపోయినా వెబ్ సిరీస్ ద్వారా బాగానే హిట్ కొట్టేస్తుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.