శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:54 IST)

ప్రభాస్ నిర్ణయంతో ఆలోచనలో పడ్డ నాగ్

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రాథేశ్యామ్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా..? అని ఎదురు చూస్తే.. మహానటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగ్ అశ్విన్‌తో సినిమాని ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అది కూడా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాకుండా.. పాన్ వరల్డ్ అంటూ ఎనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఎదురు చూస్తుంటే... ప్రభాస్ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లకుండానే.. బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ ఎనౌన్స్ చేసి మరోసారి సర్ఫ్రైజ్ చేసాడు.
 
అయితే ఆదిపురుష్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి నాగ్ అశ్విన్ ఆలోచనలో పడ్డాడట. ఎందుకంటే.. రాథేశ్యామ్ పూర్తవ్వాలి. ఆ తర్వాత నాగ్ అశ్విన్‌తో సినిమా స్టార్ట్ చేస్తాడా..? ఆదిపురుష్ స్టార్ట్ చేస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. దీంతో నాగ్ అశ్విన్ తెగ టెన్షన్ పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన దగ్గర కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ కథలు వున్నాయట.
 
అందుచేత ఈ గ్యాప్‌లో ఓ చిన్న కథతో సినిమా చేద్దామా... ప్రభాస్ డేట్స్ ఇచ్చేవరకు ఆగుదామా..? అని ఆలోచిస్తున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ రాథేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్‌తో మూవీ రెండూ ఒకేసారి చేయాలనుకుంటున్నాడని తెలిసింది. అందుచేత నాగ్ అశ్విన్ ఈ గ్యాప్‌లో చిన్న సినిమా చేయకుండా ప్రభాస్ కోసమే వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు.