మహేష్, రామ్ చరణ్ ఫోన్ ఫిక్సింగ్!
తెలుగు హీరోలు ఒకరికొకరు పోటీ అని వార్తలు బయట వస్తుంటాయి. కానీ వారంతా ఫోన్లలో తరచూ కలుస్తూనే వుంటారు. మహేష్ బాబుతో రామ్‌చరణ్ తరచూ ఫోన్లలో మాట్లాడూతనే వుంటాడట. తన సినిమా 'ఆగడు' రిలీజ్‌కు ముందు ఇద్దరూ మాట్లాడుకున్నారు. నీ సినిమా విడుదల రెండు వారాల గ్యాప్ తర్వాత నేను నటించిన సినిమా విడుదల చేస్తానని మహేష్‌తో చెప్పినట్లు రామ్‌చరణ్ ఇటీవలే తెలిపాడు.
ఇక్కడ యూత్ హీరోలు అందరం చక్కగా కలిసి వుంటాం. మా మధ్య ఎటువంటి భేషజాలు లేవని చెబుతున్నాడు. గోవిందుడు... సినిమా రిలీజ్ అయ్యాక.... మహేష్ బాబు ఇంకా సినిమా చూడకపోయినా... మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేశావని అభినందించినట్లు సమాచారం.