Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ రేటును పెంచాడు? ఎంతో తెలిస్తే షాకే...

Written By జె
Updated: శనివారం, 3 జులై 2021 (22:34 IST)
బాలీవుడ్, గీలీవుడ్ జాంతానయి. టాలీవుడ్ మాత్రమే నా కేరాఫ్ అడ్రస్ అప్పుడెప్పుడో అనేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ మాటకు ఎన్నాళ్ళు కట్టుబడి ఉంటారు అనేది అటుంచితే రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదంట మహేష్ బాబు. అసలు మహేష్ రేంజ్ ఏంటి.. కాల్షీట్లు ఎలా ఉన్నాయి..
 
సిల్వర్ జుబ్లి మూవీ మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తరువాత వచ్చిన సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్లో చాలా క్రూషియల్‌గా మారింది. కమర్షియల్ మూవీ అయిన సరిలేరు నీకెవ్వరు మూవీ హిట్ గ్యారంటీ అని నడిచింది. అప్పట్లో మేజర్ అజయక్రిష్ణ రోల్ కోసం 50 కోట్లు తీసుకున్నారనే టాక్ వినిపించింది.
 
ఇప్పుడు సర్కార్ వారి పాటలను మైత్రీ మూవీస్‌తో పాటు మహేష్ సొంత బ్యానర్ కలిసి నిర్మిస్తున్నాయి. దీనికి 58 కోట్ల రెమ్యునరేషన్ కోడ్ చేశారట మహేష్. నిర్మాణంలో కూడా పార్టిసిపేషన్ ఉంది కాబట్టి దానికి తగినట్లుగా రెవిన్యూను షేర్ చేసుకునేట్లుగా డీల్ కూడా కుదిరిందట. 
 
త్రివిక్రమ్ మూవీతో చేస్తున్న హ్యాట్రిక్ మూవీలోను తగ్గేది లేదంటున్నారు సూపర్ స్టార్. మిగిలిన మార్కెట్లను ఎట్రాక్ట్ చేసే విధంగా కంటెంట్ రెడీ అవుతోందట. కలెక్షన్ల వసూళ్ళు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఉండొచ్చని సినీ విశ్లేషకుల అంచనా. అందుకే ఈ సినిమాకు 60 కోట్ల వరకు తీసుకోబోతున్నారట మహేష్ బాబు.
 
అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో సెట్స్ పైకి వెళ్ళబోయే ఈ క్రేజీ మూవీ సమ్మర్ సీజన్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తరువాత జక్కన్నతో కలిసి సినిమా చేస్తే అది ఎంత అవుతుందన్న దానిపై సినీపరిశ్రమలో చర్చ జరుగుతోంది. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments