శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్

ప్రైవేటుగా కలుసుకోనున్న టాలీవుడ్ ప్రిన్స్ - మిల్కీబ్యూటీ!?

టాలీవుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్. అయితే, ఇపుడు మిల్కీ బ్యూటీ తమన్నా పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ మూవీలో ఆమెకు ఏదైనా చిన్న రోల్ లేదా ఐటమ్ సాంగ్‌లో నటించే ఛాన్స్ ఇస్తున్నారా అనే సందేహం ఉత్పన్నమైంది. 
 
అయితే తమన్నా - మహేష్ బాబులు కొత్త చిత్రంలో నటించడం లేదనీ, ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోసం న‌టించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. 
 
ఇప్ప‌టికే మ‌హేశ్.. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తాను న‌టిస్తోన్న 27వ చిత్రం 'స‌ర్కారువారిపాట' సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుని దుబాయ్ నుంచి హైద‌రాబాద్ చేరుకున్న సంగ‌తి తెలిసిందే. 
 
తదుపరి షెడ్యూల్ స్టార్ట్ అయ్యే గ్యాప్‌లో క‌మిట్ అయిన క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌ను పూర్తి చేయాల‌ని మ‌హేశ్ ప్లాన్ చేసేశాడు. అందులో భాగంగానే ఓ క‌మ‌ర్షియ‌ల్‌యాడ్‌లో త‌మ‌న్నాతో క‌లిసి న‌టిస్తున్నాడు మ‌రి.