ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Modified: గురువారం, 27 డిశెంబరు 2018 (18:33 IST)

హీరోలకు సహకరించని హీరోయిన్... కారణం అదేనంట...

మెహ్రీన్... ఈమధ్య కాలంలో ఈ హీరోయిన్ పేరు బాగా పాపులారిటీలోకి వచ్చేసింది. సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా అయితే ఫర్వాలేదు కానీ వివాదాలతో ఆమె పేరు వినబడుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటయా అంటే... మెహ్రీన్ ఆమధ్య పారితోషికం గొడవలతో వార్తల్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మళ్లీ హీరోలకు ఆమె సహకరించడం లేదనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. 
 
హీరోలకు సహకరించకపోవడం ఏంటయా అంటే.. షూటింగులకు వచ్చిన మెహ్రీన్ కండిషన్లు పెడ్తోందట. పైగా హీరోలను లెక్కచేయడంలేదట. దీనితో చిర్రెత్తిపోయిన హీరోలు... ఆమెకు నెక్ట్స్ ఆఫర్ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారట. దీనితో మెహ్రీన్ చేతిలో ఎఫ్ 2 చిత్రం తర్వాత ఒక్కటి కూడా లేకుండా పోయిందట. 
 
దీనిపై మెహ్రీన్ ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం ఆమెపై సెటైర్లు వేస్తున్నారట. ఏదో టాప్ హీరోయిన్ అయితే ఇలా ప్రవర్తించినా సర్లే అనుకుంటారు కానీ ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కుకోకముందే ఇలా ప్రవర్తించడం ఏంటి మెహ్రీన్ అంటున్నారట. మరి నిజంగా మెహ్రీన్ ఇలా ప్రవర్తిందా లేదా అన్నది తేలాల్సి వుంది.