సీతా రామం గ్రాండ్ సక్సెస్.. భారీగా పెంచేసిన మృణాల్..
"సీతా రామం" గ్రాండ్ సక్సెస్ కారణంగా, అందాల భామ మృణాల్‌కు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయని.. దీంతో అమ్మడు తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందని తెలుస్తోంది. ఏదేమైనా సీతా రామం ఎఫెక్ట్ కారణంగానే అమ్మడు తన రెమ్యునరేషన్ పెంచేసిందని టాక్ వస్తోంది.
ఇకపోతే.. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ సీతా రామం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది.
ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌లు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.
ఇక ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.