Daily Horoscope
✕

మా ఇద్దర్నీ విడదీయొద్దు... ప్రాధేయపడుతున్న కోలీవుడ్ ప్రేమజంట

Written By ఠాగూర్
Updated: గురువారం, 9 జనవరి 2020 (17:41 IST)
పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ప్రేమికుల్లో హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ ముందువరుసలో ఉన్నారు. అయితే, ఈ ప్రేమ జంటపై ఈ మధ్యకాలంలో లేనిపోని పుకార్లు వస్తున్నాయి. ఈ ప్రేమ జంట విడిపోయినట్టు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, విఘ్నేష్ శివన్ పెళ్లి ప్రస్తావన తీసుకునిరావడంతో నయనతార నో చెప్పడంతో ఈ విభేదాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. దీంతో నయనతార - విఘ్నేష్‌ల ప్రేమ విఫలమైనట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 
 
ఈనేపథ్యంలో తమ ప్రేమ బంధంపై వస్తున్న పుకార్లకు ఈ ప్రేమ జంట చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఇందులోభాగంగా, వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్ చేశారు. అలాగే, తామిద్దరూ చాలా సంతోషంగా ఉన్నాని ఓ అవార్డు ఫంక్షన్‌లో పరోక్షంగా నయనతార స్పందించింది. కాగా, వీరిద్దరూ పెళ్లి కాకుండానే గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న విషయం తెల్సిందే. అదేసమయంలో నయనతారకు సినీ అవకాశాలు కూడా వరుసబెట్టి వస్తున్నాయి. 

అన్నీ చూడండి

చాక్లెట్లు, వడా పావ్ కొనిస్తానని చెప్పి ఇద్దరు కుమారుల్ని కాలువలో విసిరేశాడు..

ఇంట్లో నుంచి కాలు బయటపెట్టొద్దు.. వైకాపా ఎంపీ అవినాశ్‌కు పోలీసుల నోటీసు

ప్రమాదంలో చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారు.. తప్పిన ముప్పు

తీవ్ర తుఫానుగా బలపడిన అక్వాన్.. గాలుల వేగం గంటకు 120-130 కిలోమీటర్లు

భారత్ ఫ్యూచర్ సిటీ ప్లాన్.. రూ.18,000 కోట్ల పెట్టుబడి అవసరం

అన్నీ చూడండి

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?

ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?

ప్రాణాంతక యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ముప్పును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?

బ్రిటిష్ పోషకాహార శాస్త్రాన్ని భారతదేశానికి పరిచయం చేస్తూ, షిఫ్ట్‌లైఫ్ యాంటీ-స్పైక్ డైలీని ఆవిష్కరించిన మోడికేర్

తర్వాతి కథనం
Show comments