బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (15:40 IST)

మేలోనే ఇలియానా పెళ్లి.. ఆగస్టులో పండంటి బిడ్డ.. నిజమేనా?

గోవా బ్యూటీ ఇలియానా ‘దేవదాసు’తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలను అందుకున్న ఈమె.. మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ సినిమాలో కథానాయికగా నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీని ఇన్నాళ్లు షేక్ చేసింది. 
 
తెలుగులో నటిస్తూనే హిందీ సినిమాల్లో అదరగొట్టిన ఇలియానా అక్కడ కూడా పాపులర్ అయ్యింది. ఆమె ‘బర్ఫీ’, ‘ఫటా పోస్టర్ నిక్లా హీరో’, ‘మెయిన్ తేరా హీరో’, ‘రుస్తుం’లలో నటించింది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 1న ఇలియానా మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
అయితే పెళ్లి కాకుండానే ఇలియానా గర్భవతి అయినట్లు అందరూ అనుకున్నారు. కానీ ఈ ఏడాది మేలో ఇలియానా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన ప్రియుడు మైఖేల్ డోలన్‌ను ఇలియానా మేలోనే వివాహం చేసుకుందని సమాచారం.