మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (11:38 IST)

బేబీ బంప్.. ఎల్లో బికినీ... ఇలియానా బేబీమూన్ ఫోటోలు వైరల్

టాలీవుడ్ ఒకప్పటి టాప్ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా వుంది. ప్రస్తుతం బేబీమూన్‌ ఎంజాయ్ చేస్తోంది. విటమిన్ డి కోసం ఎండలో బికినీలో కూర్చుని వుంది. ఈ సందర్భంగా ప్రకాశవంతమైన పసుపు రంగు బికినీలో ధరించిన చిత్రాన్ని షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
"కొంత అందమైన సూర్యరశ్మిని ఆస్వాదించాను. బేబీ కూడా దీన్ని ఇష్టపడిందా అని ఆలోచించండి." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా ఇలియానా ఏప్రిల్‌లో తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రకటన చేసింది.  
 
అయితే, తనకు పుట్టబోయే బిడ్డ తండ్రి గురించిన వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా ప్రేమాయణంలో ఉన్నట్లు గతంలో పలు వార్తలు వచ్చాయి.