గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2017 (14:31 IST)

నిఖిల్ ఎంగేజ్‌‌మెంట్ ఆగిపోయిందట.. కారణం ఏమిటో తెలుసా?

హ్యాపీడేస్ స్టార్, యంగ్ హీరో నిఖిల్ ఎంగేజ్‌మెంట్ రద్దు అయినట్లు తెలుస్తోంది. నిఖిల్-తేజస్వినిలకు వివాహం చేయాలని ఇరు కుటుంబీకులు అనుకున్నారట. అయితే జాతకాలు కుదరకపోవడంతో.. ఇరు కుటుంబాల వారు కూర్చుని మాట

హ్యాపీడేస్ స్టార్, యంగ్ హీరో నిఖిల్ ఎంగేజ్‌మెంట్ రద్దు అయినట్లు తెలుస్తోంది. నిఖిల్-తేజస్వినిలకు వివాహం చేయాలని ఇరు కుటుంబీకులు అనుకున్నారట. అయితే జాతకాలు కుదరకపోవడంతో.. ఇరు కుటుంబాల వారు కూర్చుని మాట్లాడుకున్నారు. ఆపై నిఖిల్ -తేజస్విని నిశ్చితార్థం- పెళ్లి ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. నిఖిల్ కోసం బంధువుల అమ్మాయిని చూస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. 
 
కాగా.. నిఖిల్‌కి హైదరాబాద్ కి చెందిన ఒక వ్యాపార వేత్త కూతురు 'తేజస్విని'తో వివాహం జరగనున్నట్టు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. వీరి నిశ్చితార్థం ఈ నెల 24వ తేదీన జరుగుతుందని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఆ రోజున నిఖిల్ ఇంట ఎలాంటి హడావుడి జరగలేదు.

దీంతో నిఖిల్-తేజస్వినిల నిశ్చితార్థం ఆగిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కాగా ఇప్పటికే హ్యాపీడేస్‌తో నటించిన వరుణ్ సందేశ్.. వితికాషేరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిఖిల్ కూడా త్వరలో ఒకింటివాడవుతాడని ఆతడి కుటుంబీకులు తెలిపారు.