మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (14:17 IST)

గర్భవతి అయిన బాలీవుడ్ నటి కుమార్తెకు మళ్లీ పెళ్లి!

ఇప్పటికే గర్భవతి అయిన బాలీవుడ్ నటి కుమార్తె మళ్లీ చేసుకోనుంది. ఈ గర్భందాల్చిన యువతి కూడా హీరోయిన్ కావడం గమనార్హం. ఇంతకీ వారెవరో ఓసారి పరిశీలిద్ధాం.

ఇప్పటికే గర్భవతి అయిన బాలీవుడ్ నటి కుమార్తె మళ్లీ చేసుకోనుంది. ఈ గర్భందాల్చిన యువతి కూడా హీరోయిన్ కావడం గమనార్హం. ఇంతకీ వారెవరో ఓసారి పరిశీలిద్ధాం.
 
బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర, బ్యూటీ క్వీన్ హేమమాలిని దంపతుల ముద్దుల కుమార్తె ఇషా డియోల్‌. ఈమె ప్రస్తుతం గర్భవతి. సంప్రదాయం ప్రకారం తన భర్త భరత్ తఖ్తానీని మరోసారి వివాహం చేసుకోనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, సింధి అయిన భరత్‌ తఖ్తానీని ఇషా డియోల్ 2012లో ఇస్కాన్ టెంపుల్‌లో వివాహం చేసుకుంది. అప్పుడు సింధీల సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేసిన ఈ జంట ఇప్పుడు మరోసారి మూడడుగులు వేయనుంది. 
 
సింధీల సంప్రదాయంలో జరిగే ఈ తంతును ‘గోధ్‌ భరాయ్‌’ అంటారు. మరో రెండు నెలల్లో ఇషా తల్లి కాబోతోంది. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ఇషా ధరించే దుస్తులను ఆమె వివాహ దుస్తులకు డిజైనర్‌గా వ్యవహరించిన నీతా లుల్లా డిజైన్ చేస్తున్నారు. ఈ దుస్తుల కోసమే ఏకంగా కోటి రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్టు బీ-టౌన్ వర్గాల సమాచారం.