మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (12:13 IST)

అఖిలపై కామెంట్స్ : రోజా.. నోరు తగ్గించుకుంటే మంచిది... క్లాస్ పీకిన భర్త

ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజాను ఆమె భర్త, సినీ దర్శకుడు, ఫెస్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మందలించారు

ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజాను ఆమె భర్త, సినీ దర్శకుడు, ఫెస్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మందలించారు. 
 
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా, టీడీపీ నేతల మధ్య మాటలు వార్ సాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో ముందుకెళుతున్నారు. ఇలా పేలుతున్న మాటల తూటాలు ఒక్కోసారి మిస్ ఫైర్ అవుతున్నాయి. అలాగే, రోజా చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యాయి. దీంతో నలువైపుల నుంచి ఆమెపై విమర్శలు వచ్చాయి. 
 
చుడీదార్‌లు వేసుకునే నువ్వా సంప్రదాయం గురించి మాట్లాడేది? అని అఖిలప్రియను రోజా విమర్శించింది. దుస్తులు వేసుకోకుండా సినిమాల్లో నటించిన మీరేనా... డ్రెస్సుల గురించి మాట్లాడేది? అంటూ టీడీపీ నుంచి గట్టి కౌంటర్ మొదలైంది. ఇలా వివాదం చిలికిచిలికి గాలివానలా తయారైంది. 
 
ఈ వివాదం కాస్త రోజా భర్త సెల్వమణికి చుట్టుకుంది. ఆయనకు ఎక్కడకు వెళ్లినా ఇదే ప్రశ్న ఎదురవుతుందట. రోజా అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ చాలామంది ఆయనతో చెబుతుండటంతో ఇదే విషయాన్ని ఆయన భార్య వద్ద ప్రస్తావించారట. ఇలాంటి వ్యాఖ్యల జోలికి పోకుండా ఉంటేనే మంచిదని మందలించారట. రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న రోజా... భర్త సెల్వమణి మాటలను శిరవావహిస్తారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.