శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (19:12 IST)

రోజాది చింతామణి క్యారెక్టర్... ఆల్కహాల్ టెస్టు జరిపించాలి: బుద్ధా వెంకన్న

సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలతో ప్రారంభమైన టీడీపీ, వైసీపీ కామెంట్లు తారాస్థాయికి చేరుకుంది. మంత్రి అఖిల ప్రియ వస్త్రధారణపై రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తాజాగా టీడీపీ ఎమ్

సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలతో ప్రారంభమైన టీడీపీ, వైసీపీ కామెంట్లు తారాస్థాయికి చేరుకుంది. మంత్రి అఖిల ప్రియ వస్త్రధారణపై రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న మరో అడుగు ముందుకేసి.. రోజా సంచలన కామెంట్స్ చేశారు.
 
మద్రాసులో చెల్లని చెక్కుల కేసుల్లో రోజా ఎన్నోసార్లు కోర్టు మెట్లు ఎక్కారన్నారు. అలాంటి వ్యక్తికి టీడీపీ నేతలను విమర్శించే స్థాయి లేదని తెలిపారు. చంద్రబాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా టీడీపీకి లక్ష మెజార్టీ పెరిగినట్లేనన్నారు. 
 
ప్రతిపక్ష పార్టీ ఓ డ్రామా కంపెనీలా మారిందని విరుచుకుపడ్డారు. వైసీపీ డ్రామా కంపెనీలో రోజాది చింతామణి క్యారెక్టర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలప్రియ డ్రెస్ గురించి రోజా మాట్లాడడం విడ్డూరంగా ఉందని, సభలో పాల్గొనేటప్పుడు రోజాకు ఆల్కహాల్ టెస్టు జరిపించాలన్నారు. అఖిలప్రియ డ్రెస్ గురించి రోజా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు