మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (15:05 IST)

వీలుంటే ప్రతి యేడాది పెళ్లి చేసుకుంటానంటున్న బాలీవుడ్ హీరోయిన్!

మన దేశ సంప్రదాయం అనుమతిస్తే ప్రతి యేడాది పెళ్లి చేసుకుంటానని బాలీవుడ్ నట బిపాసా బసు అంటోంది. ముంబైలో జరిగిన ‘ది గ్రేట్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి బిపాసా ముఖ్య అతిథిగా హాజరైంది

మన దేశ సంప్రదాయం అనుమతిస్తే ప్రతి యేడాది పెళ్లి చేసుకుంటానని బాలీవుడ్ నట బిపాసా బసు అంటోంది. ముంబైలో జరిగిన ‘ది గ్రేట్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి బిపాసా ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా బిపాసా తన వివాహ వేడుకకు సంబంధించిన విషయాలను పంచుకుంది. 
 
‘ఎలోన్‌’ చిత్రీకరణ సమయంలో ప‌రిచ‌య‌మైన క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌ను ఆమె 2016లో వివాహం చేసుకుంది. తన భర్తతో తనకున్న అనుబంధం ఎప్పటికీ పదిలంగా ఉండాలని ఆయన‌ను ప్ర‌తి ఏటా వివాహం చేసుకోవాల‌నిపిస్తోంద‌న్నారు. తన పెళ్లి చాలా హడావుడిగా జరిగింద‌ని, వీలైతే ప్ర‌తి ఏటా తన భర్తని పెళ్లి చేసుకోవాలని ఉందని బిపాసా చెప్పుకొచ్చింది.