శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (10:36 IST)

నాపై కోపమొస్తే సమంత సీరియస్‌గా చూస్తుంది.. పోట్లాట మాత్రం వుండదు: నాగచైతన్య

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య త్వరలో పెళ్ళి ద్వారా ఒకటి కానున్నారు. తనపై కోపమొస్తే సమంత సీరియస్‌గా చూస్తుందని.. పోట్లాడటం మాత్రం ఉండదని తెలిపాడు. నిశ్చితార్థం తర్వాత తమ ఇద్దరిలో ఎలాంటి మార్పుల

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య త్వరలో పెళ్ళి ద్వారా ఒకటి కానున్నారు. తనపై కోపమొస్తే సమంత సీరియస్‌గా చూస్తుందని.. పోట్లాడటం మాత్రం ఉండదని తెలిపాడు. నిశ్చితార్థం తర్వాత తమ ఇద్దరిలో ఎలాంటి మార్పులు రాలేదని.. ఇంతకు ముందులాగానే ప్రస్తుతం కూడా హ్యాపీగా వున్నామని చెప్పాడు. తన లవ్ స్టోరీని ఎవరైనా సినిమా తీయాలనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. 
 
తనకు కాబోయే భార్య సమంత ప్రపంచంలోనే అందరికన్నా అందమైన అమ్మాయని చైతూ చెప్పాడు. సమంత అనగానే తనకు మొదట గుర్తుకొచ్చేది ప్రపంచంలోనే ఓ గొప్ప మనిషి అని తెలిపాడు. హీరో నాగచైతన్య తను నటించిన యుద్ధం శరణం సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా రేడియో మిర్చిలో కాసేపు అలరించారు. ఈ సందర్భంగా రేడియో మిర్చితో తనకు సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. చైతు మొబైల్‌లో వాల్ పేపర్‌గా ఫెరారీ కారు ఉంటుందని చైతూ తెలిపాడు.
 
ఇకపోతే.. గతకొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సమంత- చైతూ ఇరువురి సంప్రదాయాల ప్రకారం.. అక్టోబర్ 6, 7 తేదీల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వివాహానికి ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు మరి కొంతమంది ప్రముఖుల్ని మాత్రమే ఆహ్వానించారట నాగార్జున.

అందుకోసం వారికి ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ కార్డ్స్ రెడీ చేస్తున్నారట. ఈ పెళ్లి కార్డులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమ్మూ-చైతూ వివాహం ముగిసిన తర్వాత హైదరాబాద్‌లో రిసిప్షన్ నిర్వహించి అందరి సన్నిహితుల్ని సినీ ప్రముఖులను పిలిచి నాగార్జున పార్టీ ఇస్తారని తెలుస్తోంది.