బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (17:03 IST)

లెస్బియన్‌గా నిత్యామీనన్: హీరోయిన్‌తో రొమాన్స్

నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపించేందుకు నిత్యామీనన్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించేందుకు నిత్యామీనన్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో నిత్యామీనన్ లెస్బియన్ పాత్రలో కనిప

నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపించేందుకు నిత్యామీనన్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించేందుకు నిత్యామీనన్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో నిత్యామీనన్ లెస్బియన్ పాత్రలో కనిపించనుందట. తెలుగులో తెరకెక్కే ఈ సినిమా మరో హీరోయిన్‌తో నిత్యామీనన్ రొమాన్స్ చేయనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 
ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం గే, లెస్బియన్ సెక్స్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో.. లెస్బియన్‌గా నటించే నిత్యామీనన్ రొమాన్స్‌కు సెన్సార్ బోర్డు అనుమతి ఇస్తుందో లేదోనని చర్చ సాగుతోంది.  ప్రస్తుతం నిత్యామీనన్ 'అ!' సినిమాతో పాటు మరో భారీ బడ్జెట్ చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.