గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (15:52 IST)

న‌య‌న‌తార డిమాండ్ కు ఓకే!

Nayanatara
న‌య‌న‌తార త‌న హ‌వా కొన‌సాగిస్తోంది. త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు భిన్న‌మైన పాత్ర‌లు ఎంపిక చేసుకుంటూనే వుంటుంది. ఎంత పెద్ద హీరో అయినా ప్ర‌మోష‌న్‌కు రాన‌ని ముందుగానే చెప్ప‌స్తుంది అగ్రిమెంట్‌లో అలా ముందుగానే ష‌ర‌తు పెడుతుంది. ఇలా చాలా తెలుగు సినిమాల‌లో నిర్మాత‌ల‌కు పెద్ద స‌మ‌స్య అయినా ఆమె డిమాండ్ ను బ‌ట్టి ఎవ్వ‌రూ ఎదురు చెప్ప‌రు. ఇప్పుడు తాజాగా తెలుగులో మ‌రో సినిమా చేస్తోంది.

అయితే తమిళంలో బిజీగా ఉండటం వలన ఆమె ఇక్కడ ఎక్కువ సినిమాలు చేయలేకపోతోంది. తాజాగా చిరంజీవి చేయనున్న ‘లూసిఫర్’ రీమేక్ కోసం కూడా నయనతారనే అడిగారట. మలయాళంలో మంజూ వారియర్ చేసిన పాత్ర ఇది. అయితే తన పోర్షన్ ను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని నయనతార అందనీ, అందుకు మేకర్స్ అంగీకరించారని చెబుతున్నారు.
 
తమ సినిమాను ఆమెతోనే చేయాలనే ఉద్దేశంతో వెయిట్ చేసే దర్శక నిర్మాతలు చాలామందినే ఉన్నారు. ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ఆనందంగా అంగీకరిస్తూ ఉంటారు.అలాంటి నయనతారకు తెలుగులోను అదే స్థాయిలో క్రేజ్ ఉంది. అందువలన సీనియర్ స్టార్ హీరోల సరసన ఆమెను తీసుకోవడానికే తొలి ప్రాధాన్యతను ఇస్తుంటారు.