పెళ్ళి చూపులు హీరో చాలా ఓవర్ చేస్తున్నాడా? పారితోషికం బాగా పెంచేశాడట..
ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్ళి చూపులు సినిమాల్లో నటించిన యువ హీరో విజయదేవరకొండపై టాలీవుడ్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్ళి చూపులు హిట్ కావడంతో విజయ దేవరకొండకు కూడా యూత్‌లో మంచి క్రేజ్ పెరిగింది. ప
ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్ళి చూపులు సినిమాల్లో నటించిన యువ హీరో విజయదేవరకొండపై టాలీవుడ్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్ళి చూపులు హిట్ కావడంతో విజయ దేవరకొండకు కూడా యూత్‌లో మంచి క్రేజ్ పెరిగింది. పెళ్ళి చూపులు హిట్ కొట్టడంతో విజయదేవరకొండ చాలా ఎక్కువ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా పారితోషికాన్ని కూడా భారీగా పెంచినట్లు టాక్ వస్తోంది.
ఈ వార్తలపై విజయదేవరకొండ స్పందిస్తూ.. తనకు ఇంత పారితోషికం కావాలని ఎప్పుడూ నిర్మాతలను డిమాండ్ చేయలేదని, సహజంగా ఎవరైనా హిట్ దొరికితే అలా చేస్తారని చెప్పారు. అయినప్పటికీ తాను మాత్రం నిర్మాతలకే ఆ అవకాశాన్ని వదిలేశానని, తన నిర్మాతలకు తనకు ఎంతివ్వాలో తెలుసునన్నారు. మొత్తానికి తనపై వస్తున్న ఈ రూమర్‌లకు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నమే చేశాడు. పెద్ద హీరోలకే కాకుండా నాకు కూడా గాసిప్పు బాధ తప్పడం లేదు అంటూ వ్యాఖ్యానించాడు.