Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.4 కోట్లిస్తే వస్తానంటున్న 'జిగేల్ రాణి'

Written By ఠాగూర్
Updated: గురువారం, 19 మార్చి 2020 (08:44 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో పట్టిందల్లా బంగారంగా మారిన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈ భామ నటించిన ప్రతి చిత్రం సూపర్ హిట్టే. గత యేడాదిలాగానే ఈ యేడాది కూడా ఈ భామకు బాగా కలిసివచ్చింది. ఫలితంగా టాప్ గేర్‌లో దూసుకెళుతోంది. వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. దీంతో తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసింది. 
 
గత సంక్రాంతికి విడుదలైన అల.. వైకుంఠపురంలో చిత్రంతో ఈ భామ క్రేజ్‌ ఆకాశానికి చేరిపోయింది. ఈ చిత్రం కోసం 2 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న ఈ అందాలభామ ఇప్పుడు తెలుగులో రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట. 
 
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన ‘జాన్‌', అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రంలో నటిస్తున్న పూజాకు తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా మంచి పాపులారిటీ సంపాందించుకుంది.
 
ఇటీవల ‘హౌజ్‌ఫుల్‌-4’ చిత్రంలో బాలీవుడ్‌ జనాలను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు సల్మాన్‌ఖాన్‌తో నటించనున్న ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ చిత్రానికి రూ.4 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసిందట. 
 
ఇక పూజా హెగ్డేకు వున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ చిత్ర నిర్మాత సాజిద్‌ నడియాలా కూడా ఆమె డిమాండ్‌కు అంగీకరించాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పడిన ఐటం గర్ల్ అనే ముద్రను చెరిపేసుకుంటూ ముందుకుసాగిపోతోంది. 

అన్నీ చూడండి

August 28, 2026: శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

బాలికను వివస్త్రను చేసి పూజలు చేస్తే కోటీశ్వరులవుతారు: దొంగ బాబాల అఘాయిత్యం

భారీగా పడిపోయిన చికెన్ ధరలు, కారణం ఇదే

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పీఠం ఎవరిది? ప్రధాని ఎవరు? సర్వే షాకింగ్ రిజల్ట్స్

గర్భిణీగా వున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై ఇనుప రాడ్‌తో దాడి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్స

హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?

ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?

సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్‌స్టిట్యూట్‌

తర్వాతి కథనం
Show comments