Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బుట్టబొమ్మ బాగా డిమాండ్ చేస్తుందట

Written By శ్రీ
Updated: సోమవారం, 28 సెప్టెంబరు 2020 (23:35 IST)
బుట్టబొమ్మ.. ఈ పేరు చెబితే చాలు అందరికీ ఠక్కున గుర్తుకువచ్చే పేరు పూజా హేగ్డే. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం అల.. వైకుంఠపురములో. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
 
ఇక ఈ సినిమాలో పాటలు అయితే.... యూట్యూబ్‌ని షేక్ చేసాయి. అసలు విషయానికి వస్తే... అదేనండి క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే విషయానికి వస్తే.. ఒక లైలా కోసం, ముకుంద సినిమాల్లో నటించింది.
 
ఆతర్వాత ఆశించిన స్ధాయిలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లింది. ఆ తర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.
 
ఈ సినిమా కమర్షియల్‌గా సక్సస్ కావడంతో టాలీవుడ్లో పూజా టైమ్ స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్‌తో అరవింద సమేత, వరుణ్ తేజ్‌తో గద్దలకొండ గణేష్, అల్లు అర్జున్‌తో అల.. వైకుంఠపురములో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ప్రభాస్‌తో రాథేశ్యామ్, అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాల్లో నటిస్తుంది.
 
ఈ అమ్మడుకి కూడా బాగా డిమాండ్ ఉంది. అందుకనే .. పూజా కూడా సినిమాల్లో నటించాలంటే 2 కోట్లు డిమాండ్ చేస్తుందట. ముందు 2 కోట్లు ఇవ్వడానికి ఓకే అంటేనే కథ వింటానని చెబుతుందట. రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదట ఈ అమ్మడు. అది మేటరు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments