శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (16:16 IST)

అప్పుల భారం.. వొడాఫోన్ కొత్త మేనేజర్‌కి మూడేళ్ల పాటు నో శాలరీ

కరోనా వైరస్ కారణంగా పలువురు ఉద్యోగాలును కోల్పోతున్న సంగతి తెలిసిందే. తాజాగా వొడాఫోన్‌ను అప్పుల భారం కూడా వేధిస్తోంది. ఒక్క టెలికాం శాఖకే వొడాఫోన్ దాదాపు 7854 కోట్లు బాకీ పడింది. ఈ నేపథ్యంలోనే భాగంగా సంస్థ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అతిపెద్ద టెలికాం సంస్థగా ఒకప్పుడు గుర్తింపు పొందిన వొడాఫోన్ ఇటీవల కాలంలో భారీ సంఖ్యలో వినియోగదారులను కోల్పోతున్న విషయం తెలిసిందే.  
 
ఇలాంటి పరిస్థితుల్లో వొడాఫోన్ కొత్త మేనేజర్, సీఈఓ రవీందర్ టక్కర్‌కు మూడేళ్ల పాటు ఎటువంటి వేతనం ఇవ్వకూడదనే యోచనలో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే విధుల్లో భాగంగా ఆయన చేసే ఇతర వ్యయాలన్నీ కంపెనీనే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ఓ ప్రతిపాదనపై రాబోయే వార్షిక సమావేశాల్లో చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. 
 
త్వరలో జరగనున్న 25 వార్షిక సమావేశాలకు ముందు ఇచ్చిన నోటీసులో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. కాగా.. రవీందర్‌ రాకమునుపు వొడాఫోన్‌కు సీఈఓగా సేవలందించిన బాలేశ్ శర్మ రూ. 8.59 కోట్లు ఆదాయంగా పొందినట్టు సమాచారం.