శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (16:02 IST)

వొడాఫోన్-ఐడియా షేర్లు పెరిగాయ్.. ఎందుకో తెలుసా?

కోవిడ్‌-19 కారణంగా భారత్‌లో భవిష్యత్తులో డిజిటల్‌ వ్యాపారాలు ఊపందుకోనున్న నేపథ్యంలో టెలికమ్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. భారత్‌ మార్కెట్లో వొడాఫోన్‌-ఐడియా కూడా కీలక సంస్థ కావడంతో ఆల్ఫాబెట్‌ దీనిపై దృష్టి పెట్టినట్లు భావిస్తున్నారు. గతంలో ఈ సంస్థ జియోతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
 
ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లో వొడాఫోన్‌-ఐడియా షేర్లు భారీ లాభాల్లో ట్రేడవుతన్నాయి. ఒక దశలో ఇవి 35శాతం లాభపడ్డాయి. ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ ఐఎన్‌సీ ఈ సంస్థలో 5శాతం వాటాను కొనుగోలు చేయనుందని వార్తలు రావడంతో షేర్లు పుంజుకున్నాయి. 
 
ఆల్ఫాబెట్‌ 110 మిలియన్‌ డాలర్లు వెచ్చించి 5శాతం వాటా దక్కించుకోనుందని టాక్. ప్రస్తుతం ఈ సంస్థ విలువ నాస్‌డాక్‌లో 968.05 బిలియన్‌ డాలర్లుగా ఉంది.